
ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కరోనా వైరస్ కేసులు భారీ సంఖ్య నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం(రేపు) నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది. కర్ఫ్యూ సమయంలో షాపులు, ప్రజా రవాణా, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసి వేయనున్నారు.ఫార్మసీలు, ల్యాబ్‌లు, మీడియా, పెట్రోల్ బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. కర్ఫ్యూ సందర్భంగా కఠిన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.